![]() |

రష్మీ గౌతమ్ బుల్లితెర మీద యాంకర్ గా అందరికీ సుపరిచితమే. ప్రదీప్, సుధీర్, రష్మీ, శ్రీముఖి, సుమ ప్రస్తుతానికి వీళ్ళే బుల్లితెరను ఏలుతున్నారు. అలాంటి రష్మీ జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్ట్ గా చేసేది. కానీ రీసెంట్ గా జరిగిన మార్పుల కారణంగా ఆమెను ఒక్క జబర్దస్త్ కి మాత్రమే పరిమితం చేశారు. అలాగే ఆమె ఇంకా ఆహా ఓటిటి ప్లాటుఫారం మీద టాప్ తెలుగు ఇన్ ఫ్లూఎన్సర్ షోకి కూడా హోస్టింగ్ చేస్తోంది. అలాంటి రష్మీకి మూగ జీవాల పట్ల దయ ఎక్కువగా అలాగే దైవ భక్తి కూడా చాలా ఎక్కువే.
రీసెంట్ గా గురు పూర్ణిమ సందర్భంగా రష్మీ ఆలయానికి వెళ్ళింది. భద్రాచలం వెళ్లి భక్తితో దైవాన్ని దర్శించుకుంది. ఇక తీర్ధప్రసాదాలు తీసుకుని ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "వెరీ నైస్ ..చాలా దైవికంగా ఉన్నారు. హ్యాపీ గురు పూర్ణిమ " అంటూ విషెస్ చెప్పారు. ఒక నెటిజన్ ఐతే "చాలామంది పెళ్ళైన యాంకర్లు బీచులు, బికినీలు అంటూ చూపిస్తుంటే మీరేంటి ఇంకా పూజలు పునస్కారాలు అంటూ చూపిస్తున్నారు " అంటూ కామెంట్ చేసారు. ఇంకో నెటిజన్ ఐతే "సుధీర్ కోసమా రష్మీ గారు చేస్తున్నారు" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రాను రాను యాంకర్స్ కి షోస్ తగ్గిపోతున్నాయి. ప్రదీప్ మూవీస్ లో నటించడానికి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లేసరికి ఢీ షోకి హోస్ట్ గా నందుని పెట్టారు. రష్మీ చేతిలో ఉన్న మూడు షోస్ కాస్త రెండు అయ్యాయి. ప్రదీప్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చేసాడు. సుధీర్ డ్రామా జూనియర్స్ , ఫామిలీ స్టార్స్ చేస్తున్నాడు.
![]() |